జీరో కాదు.. బాదుడు : నాలుగు దాటితే.. జన్ థన్ ఖాతాకి మూడిందే

jan dhanప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న లక్ష్యంతో 2014 ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ లకు కొన్ని బ్యాంకులు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నెలకు నాలుగు సార్లు జన్ ధన్ అకౌంట్ లకు ఉచిత విత్ డ్రా సదుపాయం ఉంది. 5వ సారి విత్ డ్రా చేస్తున్న సమయంలో HDFC, Citi బ్యాంక్ లాంటి కొన్ని బ్యాంకులు కస్టమర్లకు తెలియకుండానే వాటిని రెగ్యులర్ ఖాతాలుగా మార్చేస్తున్నాయి.

దీనివల్ల అకౌంట్ హోల్డర్ మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చేయకపోతే.. వారు రెగ్యులర్ పెనాల్టీని భరించవలసి వస్తుంది. SBI, AXIS వంటి కొన్ని బ్యాంకులు కూడా నాలుగుసార్లు విత్ డ్రా పూర్తి కాగానే ఖాతాదారుల నుంచి సంతకాలు సేకరించి.. ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నాయి. బ్యాంకుల నిర్ణయంతో 31 కోట్ల మంది జన్‌ ధన్  ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని బ్యాంకులు వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి ఆయా ఖాతాదారులకు SMS ద్వారా సమాచారం ఇస్తున్నాయి. అయితే బ్యాంక్ ఖాతాపై పెద్ద అవగాహన లేని వారు.. అదే పనిగా విత్ డ్రాలు చేస్తూ.. ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఆ ఖాతాలు వారికి తెలియకుండా రెగ్యులర్ గా మారిపోతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates