జీరో సినిమాపై మలాల ప్రశంస

యూకే : బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ మరుగుజ్జుగా నటించిన ‘జీరో’ సినిమాను మెచ్చుకున్నారు నోబెల్ పురస్కార గ్రహిత మలాల. తాను యూకేలోని బర్మింగ్ హమ్ లో సినిమా చూశానని..చాలా బాగుందన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆదివారం(డిసెంబర్-23)న ఓ వీడియో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు మలాల.

“మిష్టర్ షారూక్ ఖాన్.. మీరు నటించిన ‘జీరో’ సినిమా బాగుంది. నాకు.. నా ఫ్యామిలీ మెంబర్స్ కు నచ్చింది. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీరు ఏదో ఓ రోజు యూకేలోని ఆక్స్ ఫర్డ్  యునివర్సిటీలో స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీరు గొప్ప వ్యక్తి” అని వీడియోలో చెప్పారు మలాలా. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. జీరోలో అనుష్క, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించగా.. సల్మాన్ గెస్ట్ రోల్ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates