జీరో సైజ్ కోసం… కడుపు మాడ్చుకొని వర్కవుట్స్

FITమారుతున్న లైఫ్ స్టైల్.. ఆహారపు అలవాట్లతో ఫిట్ నెస్ సాధించడం కష్టమవుతోంది. చదువులు.. ఉద్యోగాలు.. వ్యాపారాలంటూ హడావిడి లైఫ్ ను గడిపేస్తున్నారు. మహిళలు, అమ్మాయిలు సరైన ఫిట్ నెస్ లేక అనారోగ్యం పాలవుతున్నారు. మరికొందరు జీరో సైజ్ కోసం లేని పోని రోగాల తెచ్చుంటున్నారు.

పెరుగుతున్న పనిభారం, మారుతున్న జీవన శైలితో మహిళలు బరువు పెరుగుతున్నారు. చిన్న పిల్లల నుంచి వర్కింగ్ ఉమెన్ వరకు ఒబెసిటీతో బాధపడుతున్నారు. దాంతో పెళ్లి కాని అమ్మాయిలైతే  ఫిట్ నెస్ కోసం కడుపు మాడ్చుకొని వర్కవుట్స్ చేస్తున్నారు. కానీ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మంచి బాడీ ఫిట్ నెస్ తో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు డైటీషియన్స్.

మగవాళ్లతో పోలిస్తే మహిళలకు రోగ నిరోధకత తక్కువగా ఉంటుంది. చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు…  చాలామంది ఎనిమియాతో ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి, టెన్షన్స్ తో మహిళలు ఎనర్జీ లెవల్స్ కోల్పోతుంటారు. అయితే రెగ్యులర్ ఫుడ్ హాబిట్స్, వాకింగ్, యోగా, చిన్న చిన్న  ఎక్సర్ సైజ్ లతో బాడీ ఫిట్ నెస్ సాధించవచ్చంటున్నారు మోడల్స్. ఆహారపు అలవాట్లతో పాటు.. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు మోడల్స్. జిమ్, వర్కవుట్స్ కోసం పాకులాడకుండా.. ఆహారపు నియమాలతో ఫ్యాట్ పెరగకుండా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మెయిన్ గా టీనేజ్ అమ్మాయిలు, యంగ్ స్టర్స్.. డైట్ ఫాలో అయితే బెటర్ అని చెబుతున్నారు.

బాడీ ఎప్పుడూ ఫిట్ గా ఉండాలంటే డైలీ 3నుంచి 5కి.మీల వాకింగ్, 6 నుంచి 8గంటల నిద్ర, ఫుడ్ లో కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం మంచిదంటున్నారు. ఇప్పటి జనరేషన్ లో 18 ఏళ్ల నుంచి 30ఏళ్ల వయసు వారిలో త్వరగా బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ లాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు.  డిజిటల్ గ్యాడ్జెట్స్ కు అడిక్ట్ కాకుండా ఉండాలంటున్నారు డైటీషియన్స్. టీనేజ్ గర్ల్ నుంచి.. మిడిల్ ఏజ్ ఉమెన్ వరకు ఫిట్ గా ఉండాలంటే..టైమ్ ప్రకారం ఫుడ్ హాబిట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు డైటీషియన్స్. జాబ్స్ చేస్తున్న, పెళ్లైన మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates