జీర్ణ సమస్యలను దూరం చేసే పళ్లు ఇవే..

చాలామంది నేడు అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివాళ్లు కొన్ని పళ్లను తింటే జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధకం కూడా తగ్గుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల  ద్రాక్షను తింటే నాలుగు గ్రాముల  ఫైబర్ లభిస్తుంది. దాంతో పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్ధకం కూడా పోతుంది. ద్రాక్షలను నిత్యం తింటే జీర్ణ సమస్యల నుంచి బయటపడొచ్చు.

నారింజ పండ్లలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నారింజను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే, వాటిలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లలో ఉండే నారింజెనిన్ అనే పదార్థం లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. కాబట్టి నారింజ తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. జామ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జామ ఆకులను తిన్నా ఆయా సమస్యల నుంచి బయటపడొచ్చని కొన్ని రీసెర్చ్ లు చెపుతున్నాయి. జామ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్  గుణాలు ఉంటాయి. ఇవి డయేరియాను తగ్గిస్తాయి.

Posted in Uncategorized

Latest Updates