జీవితం ఇక చాలు: చావుకి అనుమతించాలంటూ రాష్ట్రపతికి లేఖ

ouy జీవితం ఇక చాలు అనిపించింది మాకు. ఒక్క నిమిషం కూడా బ్రతకాలని లేదు. దయచేసి మా చావుకి అనుమతి ఇవ్వండంటూ ఓ వృధ్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాసారు. అలసిపోయాం  మా వినతిని పరిశీలించడి అని ఆ వృధ్ధ దంపతులు రాసిన లేఖ ఇప్పుడు సంచలనమైంది.

ముంబాయికి చెందిన నారయణ్ లవటే(87), ఇరవతి(78) లు భార్యాభర్తలు. ఇరవతి ఓ రిటైర్డ్ స్కూల్ ప్రిన్స్ పల్ కాగా, నారాయణ్ మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేస్ లో మాజీ సూపర్ వైజర్. వీరు చార్ని రోడ్డులోని తకుర్ ద్వార్ లో నివాసముంటున్నారు. వీరికి పిల్లలు కానీ, దగ్గరి బంధువులు కానీ ఎవరూ లేరు. దీంతో జీవితంలో అలసిపోయిన ఈ దంపతులు ఫిజీషియన్ సాయంతో తమ చావుకి పర్మిషన్ ఇవ్వాలని 2017 డిసెంబర్ 21 న రాష్ట్రపతికి లేఖ రాసారు. ఆ లేక లో మార్చి 31, 2018 వరకూ వేచి చూస్తామని, అప్పటిలోగా రిప్లయి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వీరి వినతికి రిప్లయి రాకపోవడంతో ఈ దంపతులు మర్డర్ కి ఫ్లాన్ చేశారు. ఇందుకోసం ఇరవతి ఓ పోస్ట్ డేటెడ్ లేఖ(ఏప్రిల్ 1,2018) ను తన భర్తకు రాశారు. మార్చి 31 తర్వాత ఏ క్షణమైనా నన్ను నా భర్త చంపేస్తాడని, దీంతో చావాలన్న నాకోరిక తీరుతుందని, దీంతో పోలీసులు నా భర్తను అరెస్ట్ చేస్తారు. దీంతో చావాలన్న ఆయన కోరిక కూడా తీరుతుందని ఆ లేఖ లో ఇరవతి రాసింది.

Posted in Uncategorized

Latest Updates