జీవితాన్ని ఎక్కడికో విసిరేసింది : హీరోయిన్ సోనాలి బింద్రేకి క్యాన్సర్

sonali
బాలీవుడ్ హీరోయిన్ సోనాలీ బింద్రే హై గ్రేడ్ క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం న్యూయార్క్ లో క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకొంటుంది.

కొన్ని సార్లు జీవితం నుంచి తక్కువగా ఆశిస్తుంటాం. జీవితం మలుపులతో కూడిన పరీక్షలాంటిది. ఇటీవల నాకు క్యాన్సర్‌ వచ్చింది. ఏ మాత్రం ఊహించలేదు. హెల్త్ బాగోలేదని వైద్య పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు క్యాన్సర్‌ ఉందని బయటపడింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను కలవడానికి వచ్చి పోతున్నారు. అత్యుత్తమ ఆదరణను నాకు అందిస్తున్నారు. నా చుట్టూ ఇలాంటి వారు ఉండటం నా అదృష్టం. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం న్యూయార్క్‌ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, స్నేహితులే నా బలంగా పోరాడుతానని సోనాలీ బింద్రె  తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.

తెలుగులో కూడా హిట్ చిత్రాల్లో నటించారు సోనాలీ బింద్రే. చిరంజీవితో ఇంద్ర, మహేష్ తో మురారీతోపాటు చాలా సినిమాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కూడా. తనకు క్యాన్సర్ ఉందని తెలపడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో మళ్లీ తిరిగి సినిమాల్లో నటించాలని సర్వమత ప్రార్ధనలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆమెకు ఫోన్ చేసి భరోసా ఇస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలని ఓదారుస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates