జీశాట్-11 ఉపగ్రహం ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. దేశమంతటా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడంలో స‌హాయం చేసే జీశాట్‌-11 ఉప‌గ్ర‌హాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున 2.07 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. జీశాట్‌-11 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఏరియన్‌-5 రాకెట్‌ 33 నిమిషాల ప్రయాణం తర్వాత విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 5,854 కిలోల బ‌రువున్న‌ జీశాట్‌-11 ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన ఉప గ్రహాల అన్నింటికంటే బరువైంది.

బిగ్ బర్డ్ గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీ ఖర్చు రూ.6వందల కోట్లు.

 

Posted in Uncategorized

Latest Updates