జీశాట్-6A శాటిలైట్ లింక్ తెగింది: ఇస్రో

gsఇస్రో శాస్త్రవేత్తలు గురువారం(మార్చి-29)న ప్రయోగించిన  జీశాట్-6A కమ్యునికేషన్ శాటిలైట్ కు ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. ఆ శాటిలైట్‌ను చివరి కక్ష్యలో ప్రవేశపెట్టే సమయంలో లింకు తెగినట్లు తెలిపింది. ఏదైనా శాటిలైట్‌ను లాంచ్ చేసినప్పుడు దానికి కొంతకాలం వరకు భూమికి దగ్గరగా ఉంచుతారు. ఆ తర్వాత తుది కక్ష్యలోకి ప్రవేశపెడతారు. జీశాట్-6A విషయంలోనూ మొదటి రెండు దశలు విజయవంతమయ్యాయి. చివరి దశ కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో శాటిలైట్‌తో కమ్యూనికేషన్ లింకు తెగిపోయింది. ఆ శాటిలైట్‌తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఈ 2066 టన్నుల శాటిలైట్‌ను రూ.270 కోట్ల ఖర్చుతో రూపొందించారు. GSLV రాకెట్ ద్వారా దీనిని నింగిలోకి పంపించారు సైంటిస్టులు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మోహరించిన భద్రతా బలగాల దగ్గర ఉండే హ్యాండ్ డివైస్‌లకు ఈ శాటిలైట్ సమాచారాన్ని పంపించేలా లేదా పొందేలా రూపొందించారు. అయితే ఇప్పుడా శాటిలైట్‌తో లింక్ తెగడానికి కచ్చితమైన కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ శాటిలైట్ ఇస్రో తయారుచేసిన అతిపెద్ద ఆంటెనాను కలిగి ఉంది. దీంతో భద్రతా బలగాలకు డేటా ట్రాన్స్‌ఫర్ ఈజీ అవుతుంది. ఈ హ్యాండ్ డివైస్‌లను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు మరోవైపు డీఆర్డీవో కసరత్తులు చేస్తూనే ఉంది.

Posted in Uncategorized

Latest Updates