“జీ మొయిల్ గో” : కొత్త యాప్ ను లాంచ్ చేసిన గూగుల్

goooఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్‌కు గాను జీమెయిల్ గో పేరిట కొత్త యాప్‌ను లాంచ్ చేసింది సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్ధ గూగుల్. సాధారణ జీమెయిల్ యాప్‌లాగే ఈ యాప్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది లైట్ వెయిట్ యాప్. అంటే… తక్కువ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న డివైస్‌ల కోసం గూగుల్ ఈ యాప్ ను ప్రత్యేకంగా లాంచ్ చేసింది. ఇప్పటికే గో ఎడిషన్‌కు గాను గూగుల్ తన అసిస్టెంట్, జీబోర్డ్, యూట్యూబ్, మ్యాప్స్ యాప్‌లను లైట్ వెయిట్ యాప్స్ రూపంలో విడుదల చేయగా ఆ జాబితాలోకి ఇప్పుడు జీమెయిల్ గో యాప్ చేరింది. సాధారణ జీమెయిల్ యాప్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లు ఈ జీమెయిల్ గో యాప్‌లో కూడా యూజర్లకు లభిస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates