జుకర్‌బర్గ్ పేరును తీసేయండి

zuckerbergఅమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్కో నగరంలో ఉన్న ఓ ఆసుపత్రికి ఉన్న జుకర్ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తున్నా ఆ ఆస్పత్రిలోని నర్సులు. ఖాతాదారుల డాటా లీక్‌కు సంబంధించి ఇప్పటికే జుకర్‌బర్గ్ పరువు పోగొట్టుకున్నారు. దీంతో పాటే ఆయన పాపులారిటీ కూడా రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఆయన పేరునున్న ఆసుపత్రి సిబ్బంది కూడా జుకర్‌బర్గ్ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

మూడేళ్ల క్రితం జుకర్‌బర్గ్‌ ఆయన సతీమణి ప్రసిల్లా ఓ ఆస్పత్రికి 75 మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చారు. దీంతో యాజమాన్యం జుకర్ సహాయానికి కృతజ్ఞతగా ఆసుపత్రికి ఆయన పేరు పెట్టింది. ఎవరైనా విరాళాలిస్తే భవనాలకు వారి పేరు పెట్టడం అమెరికాలో కామన్. కొద్ది రోజుల క్రీతం కేంబ్రిడ్జి ఎనలిటికా వివాదంలో ఫేస్‌బుక్ చిక్కుకోవడం, జుకర్‌బర్గ్ కూడా ఇది నిజమేనని క్షమాపణలు చెప్పారు. దీంతో ఆసుపత్రికి చెందిన నర్సులు, పలువురు ఉద్యోగులు ఆసుపత్రికి జుకర్ పేరు తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తొలగించేది లేదని తేల్చిచెబుతోంది.

Posted in Uncategorized

Latest Updates