జులై 2 నుంచి హైకోర్టు పనివేళల్లో స్వల్పమార్పు

Telangana-High-Courtఉమ్మడి హైకోర్టు పనివేళలు జులై 2వ తేదీ నుంచి మారనున్నాయి. సోమవారం నుంచి ఉదయం 10.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు హైకోర్టు పని చేయనుంది. ప్రస్తుతం ఉదయం పదిన్నర నుంచి సాయంత్ర నాలుగున్నర గంటల వరకు కోర్టు పని చేస్తుంది. సాయంత్రం కోర్టు వేళలు పూర్తయిన తర్వాత సిబ్బంది, న్యాయవాదులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్యలపై హైకోర్టుకు పలు విజ్ఞప్తులు రావడంతో, పనివేళల్లో ఈ చిన్న మార్పు చేశారు.

Posted in Uncategorized

Latest Updates