జూనియర్ పవర్ స్టార్ అని పిలిస్తే… బ్లాక్ చేసేస్తా : రేణూదేశాయ్

renతన కొడుకుని అకీరాని ఎవ్వరూ జూనియర్ పవర్ స్టార్ అని పిలవవద్దన్నారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్. అకీరాని జూనియర్ పవర్ స్టార్ అని పిలిచినా అతడి తండ్రికి, నాకు, అతడికి కూడా ఇష్టం వుండదని, ఎవ్వరూ అలా పిలవవద్దనారు రేణూదేశాయ్. సీరియస్ లుక్ లో కన్సిస్తున్న అకీరా ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన రేణూదేశాయ్…. ఈ ఫోటోకి ఎవరైనా జూనియర్ ప‌వ‌ర్‌స్టార్ అని కామెంట్ పెడితే వారిని బ్లాక్ చేసేస్తానని తెలిపింది. ఇది ఈరోపియ‌న్ సినిమాలోని సీరియ‌స్ పాత్ర‌లోని లుక్ అని, తన ల్యాప్ టాప్ లో ఓ గేమ్ చూస్తున్న సమయంలో తీసిన ఫోటో అని తెలిపింది. అయితే కొన్ని రోజుల క్రితం నీలో నాకు కావల్సినంత ప్రేమ దొరికింది, నీతో ఉంటే ఆ సంతోషాన్ని చెప్పలేను, నా చెయ్యి ఇలాగే పట్టుకో…..ఎప్పటికీ విడువకు. అవును ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావంటూ ఒకరి చేయి పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసింది రేణూదేశాయ్. దీంతో రేణూదేశాయ్ రెండవ పెళ్లి చేసుకోబోతుందని అందరూ భావించినప్పటికీ రేణూదేశాయ్ మాత్రం దానిపై స్పందించలేదు.

Posted in Uncategorized

Latest Updates