జూన్ 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

 

jupallyజూన్ 10 నాటికి పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్రకటించనుంది పంచాయతీరాజ్ శాఖ. స‌ర్పంచ్‌, వార్డు స్థానాల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు. ఈ నెలాఖ‌రులోగా బీసీ ఓట‌ర్ల గ‌ణ‌న‌ను పూర్తి చేసి, వ‌చ్చే నెల 10 లోపు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు.పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ గురించి తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, ఇత‌ర అధికారుల‌తో స‌మీక్షించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.

2011 గ్రామీణ జ‌నాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు వివరించారు అధికారులు.  జూన్ 10 నాటికి జిల్లాల‌ వారీగా స‌ర్పంచ్ స్థానాల రిజ‌ర్వేష‌న్ల సంఖ్య‌ను రాష్ట్ర‌ స్థాయిలో పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్‌, వార్డు మెంబ‌ర్ల సంఖ్య‌ను జిల్లా స్థాయిలో మండ‌లాల‌వారీగా క‌లెక్టర్లు ఖ‌రారు చేయ‌నున్నారు. ఈ ప్ర‌క్రియ‌ను పార‌ద‌ర్శ‌కంగా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.

Posted in Uncategorized

Latest Updates