జూన్ 2019 నాటికి దేవాదుల, మల్కాపూర్ పనులు: క‌డియం

kadiyamఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల మూడో దశ పనులు, తుపాకులం గూడెం దగ్గర  బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియ శ్రీహరి. 2019 జూన్ వరకు వీటిని పూర్తిచేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సవరించిన అంచనాల ప్రకారం దేవాదులకు 13,400 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశామని…ఇందులో ఇప్పటికే 9,400 కోట్ల రూపాయలు ఖర్చుచేశామన్నారు. జూన్ 2019 వరకు మొదటి, రెండో, మూడో దశ పనులు పూర్తి చేయాలని సంకల్పించామని చెప్పారు. గోదావరి నది నుంచి 365 రోజులు నీటిని లిఫ్ట్ చేసే విధంగా తుపాకుల గూడెం దగ్గర 2,100 కోట్ల రూపాయలతో బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని, దీనిని 2019 వరకు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈరెండింటి పనులు పూర్తయింతే మొదటి దశలో రెండు మోటర్లు, రెండో దశలో రెండు మోటర్లు, మూడో దశలో ఆరు మోటర్లు ఉపయోగించి మొత్తం పది పంపులతో దాదాపు 270 రోజులు గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసి 60 టిఎంసీలను వ్యవసాయానికి ఉపయోగించుకునే వీలుందన్నారు. మల్కాపూర్ రిజర్వాయర్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు నేరుగా 90 రోజులపాటు 10.7 టిఎంసీల నింపే విధంగా లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

మల్కాపూర్ రిజర్వాయర్ నుంచి స్టేషన్ ఘన్ పూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్ కు నీటిని తీసుకోవచ్చని కడియం శ్రీహరి తెలిపారు. ఎత్త‌యిన‌ ప్రదేశంలో మల్కాపూర్ రిజర్వాయర్ కడుతుండడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీరు సమస్య శాశ్వతంగా తీరుతుందని చెప్పారు.

2018-19 జూలై నుంచి ప్రారంభం అయ్యేలా.. స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలో డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి కడియం.

 

Posted in Uncategorized

Latest Updates