జూన్ 7నే రిలీజ్ : కాలాకు లైన్ క్లీయర్

RAJANIసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమాకు లైన్ క్లీయర్ అయ్యింది. కావేరీ జల వివాదంతో ఇన్ని రోజులు వాయిదా పడ్డ ఈ సినిమా రిలీజ్ కు మంగళవారం (జూన్-5) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. కాలా సినిమా నిషేధంపై జోక్యం చేసుకోలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. థియేటర్ల వివరాలు అందించాలని కాలా తరపు న్యాయవాదులకు హైకోర్టు నిర్దేశించింది. కాలా సినిమా ప్రదర్శనకు తగిన భద్రత కల్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసింది. కావేరి జ‌లాల విష‌యంలో ర‌జ‌నీకాంత్ పూర్తిగా త‌మిళుల‌కి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆయ‌న సినిమాల‌ని క‌ర్ణాట‌క‌లో విడుద‌ల కానివ్వ‌మంటూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. పా రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో రజనీ సరసన హుమా ఖురేషీ హీరోయిన్ గా నటించింది. హీరో ధనుష్ గెస్ట్ రోల్ లో నటించిన కాలా వరల్డ్ వైడ్ గా జూన్ 7న రిలీజ్ కానుంది.

అయితే తీవ్ర ఉద్రిక్తతలున్న ఈ పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయకపోవడమే మంచిదన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక వ్యక్తిగా, సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా అది తన ఉద్దేశమన్నారు. కావేరీ జలాల సమస్య పరిష్కారమయ్యాక సినిమాను విడుదల చేస్తే బాగుంటుందన్నారు.  అయితే ముఖ్యమంత్రిగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates