జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ

TALASANIమృగశిర సందర్భంగా ఆస్తమా రోగుల కోసం పంపిణీ చేసే చేప మందు కోసం బుధవారం (మే-16) చర్చలు జరిపారు అధికారులు. జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని శ్రీనివాస్  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి సమీక్ష చేపట్టారు. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని జిల్లాల నుంచి RTC ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. బత్తిని హరినాథ్ గౌడ్ మాట్లాడుతూ.. జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 8వ తేదీ ఉదయం 9.30 గంటల ప్రారంభం అవుతుందన్నారు. రెండు రోజుల తర్వాత పాతబస్తీలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదాన్ని సధ్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates