జూబ్లీ హిల్స్ లో పేలుడు.. కుప్పకూలిన ఇల్లు

blastహైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు కలకలం రేపింది. రోడ్ నం.48లో నిర్మాణంలో ఉన్న ఇంటి స్థలంలో జిలిటిన్ స్టిక్స్ పేలాయి. సోమవారం (ఫిబ్రవరి-12) మధ్యాహ్నం బండరాళ్లను తొలగించేందుకు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు వినియోగించారు. ఈ పేలుళ్ల ధాటికి సమీపంలోనే ఉన్న ఓ ఇల్లు కుప్పకూలింది. భారీ శబ్దంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపు గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో ఘటనా స్థలాని చేరుకుని విచారణ చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates