జూలైలోనే పంచాయతీ ఎన్నికలు

BALLETపంచాయతీ ఎన్నికల నిర్వహణ కు ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం(NEC). వీలైనంత తక్కువ సమయంలో… జూలై నెలాఖరులోగా నిర్వహించాల్సిందేనని  ఆదేశించింది. ప్రస్తుత పాలకమండళ్ల గడువు ఆగస్టు ఒకటిన ముగియనుండటంతో ఎన్నికలు ఆ లోగానే జరగాలని..వెంటనే కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్నికల ఏర్పాట్లపై NEC అధికారులతో సమావేశం నిర్వహించింది. 2 లేదా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఎన్నికల షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అథారిటీ(అధికారి)గా పంచాయతీరాజ్‌ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అథారిటీగా జిల్లాల కలెక్టర్లు వ్వహరిస్తారని ఎస్‌ఈసీ ప్రకటించింది. పంచాయతీలకు ఎన్నికలు ఒక విడతలో నిర్వహిస్తే కనీసం 15 రోజులు, రెండు విడతల్లో నిర్వహిస్తే 19 రోజులు, మూడు విడతల్లో నిర్వహిస్తే 23 రోజుల సమయం అవసరమంది. షెడ్యూల్‌ను జూన్‌ ఒకటిన ప్రారంభిస్తే ఇలా ఉంటుందంటూ నమూనా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నమూనా షెడ్యూల్‌ను చూసి ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయిందనే ప్రచారం జరిగింది. అయితే, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరికొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతో జూన్‌ రెండో వారంలో అధికారిక షెడ్యూల్‌ వెలువడుతుందని అధికారులు అంటున్నారు.

నిబంధనలు…

… పోలింగ్‌ కేంద్రాల సమీపంలోకి ఆయుధాలతో వెళ్లడం నిషేధం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు తదితర ప్రముఖుల భద్రతకు నియమితులైన సిబ్బంది కూడా పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలుతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

… మైక్రో అబ్జర్వర్లను పనిచేస్తున్న మండలంలో గానీ, సొంత మండలంలో గానీ నియమించొద్దు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన దగ్గర మైక్రో అబ్జర్వర్లను నియమించాలి. ఒకే ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రాలన్నింటికీ కలిపి ఒక్కరినే మైక్రో అబ్జర్వరుగా నియమించాలి.

… రూ.5 డిపాజిట్‌తో ఓటర్లను పోలింగ్‌ ఏజెంట్లు చాలెంజ్‌ చేయొచ్చు.

… టెండరు ఓట్లు 0.1% కు మించి పోలైతే రీ పోలింగ్‌కు వీలుంటుంది.

…ఒకే వ్యక్తి ఒక రి కంటే ఎక్కువ మందికి సహాయకుడిగా వచ్చేందుకు వీల్లేదు.

…పోలింగ్‌ ఏజెంట్లుగా నియమితులైన వారు సహాయకుడిగా వచ్చేందుకు వీల్లేదు.

….కౌంటింగ్‌ ముగియగానే ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

…ప్రతి బ్యాలెట్‌పై వెనుక భాగంలో పోలింగ్‌ కేంద్రం కోడ్‌ ఉంటుంది.

…పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్‌ అకౌంట్‌ను తెరవాలి.

… ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో లేనివారు ఆధార్‌ సహా 18 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా వెంట తెచ్చుకొని ఓటు వేయొచ్చు.

..నామినేషన్‌ పేపర్లపై ఇద్దరు సాక్షుల సంతకాలు చేయించాలి. తప్పుడు  సర్టిఫికెట్లు సమర్పిస్తే శిక్ష తప్పదు

పంచాయితీ ఎన్నికల నిర్వహణలో డిపాజిట్ చెల్లింపు నిబంధనలను అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సర్పంచ్ గా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2వేలు ..వార్డు మెంబర్  రూ.500 డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ గా పోటీ చేసే SC,ST,BC అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి.వార్డు మెంబర్ కు రూ.250 డిపాజిట్ గా చెల్లించాలి. ZPTC కి పోటీ చేసే జనరల్ అభ్యర్థులైతే రూ.5వేలు, MPTC కి పోటీ చేసే అభ్యర్థులు రూ.2,500 చెల్లించాలి. SC,ST,BC అభ్యర్థులైతే ZPTCకి రూ.2,500…MPTC కి పోటీ చేస్తే రూ.1,250 డిపాజిట్ గా చెల్లించాలి. అంతే కాదు ప్రతీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు వివరాలను తెలియజేసేలా…కేవలం ఎన్నికల ఖర్చుకోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ప్రారంభించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates