జూలై 15 నుంచి ఆషాడమాసం బోనాలు

BONALU 18తెలంగాణ సంసృతి సంప్రదాయాలకు అనుగూనంగా ఈ సారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ. జంట నగరాలలో జులై 15 నుంచి ప్రారంభమై … ఆగస్ట్ 6 తేదీతో ముగుస్తుందని తెలిపింది కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బోనాల జాతర ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడం తెలంగాణ అమ్మవారి భక్తులకు సంతోషం కలిగించిందని … ఈసారి బడ్జెట్ ను 10 కోట్ల నుంచి 15 కోట్లకు పెంచాలని వారు కోరారు. జులై 15న గోల్కొండ అమ్మవారి బోనాలతో ప్రారంభమవుతాయని, జులై 29న సికింద్రాబాద్ శ్రీ మహాంకాలి ఉజ్జయిని అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ఆగస్ట్ 5వ తేదీన హైద్రాబాద్ నగరంతో పాటు ఓల్డ్ సిటీలో బోనాల జాతర ఉత్సవాలు వేడుకగా జరగనున్నాయని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates