జూలై 20న లారీ యజమానుల సమ్మె

సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు జూలై 20 నుంచి సమ్మె చేపట్టనున్నారు. సింగిల్ పర్మిట్ విధానంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి. సమ్మె విరమణ సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ యజమానులను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్. కేంద్రం డీజిల్ ధరలను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించాలని కోరారు. రోడ్ సేఫ్టీ బిల్లును సవరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్.

Posted in Uncategorized

Latest Updates