జెజె ఆస్పత్రిలో ఇంద్రాణి ముఖర్జియా

indrani-mukharjeముంబైలోని బైకుల్లా జైలులో తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియాను అధికారులు జెజె ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం(ఏప్రిల్-6) రాత్రి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

ఇంద్రాణి యాంటి డిప్రసెంట్స్‌ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుందని..దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు అనుమానిస్తున్నారు. ఇంద్రాణీ ముఖర్జియాను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స చేస్తున్నామని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంజయ్‌ సురేశ్‌ చెప్పారు. ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పడంతో.. ఇంద్రాణీని పోలీసులు అరెస్టు చేశారు.

Posted in Uncategorized

Latest Updates