నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(TSGENCO)లో పలు ఉద్యోగాలకు శుక్రవారం (ఏప్రిల్-13) నోటిఫికేషన్ విడుదలైంది. 42 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు(JEO), 33 అసిస్టెంట్ మేనేజర్( HR ) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
JEO ఉద్యోగాలకు
గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ MCOM, BCOM డిగ్రీ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటర్ పూర్తిచేసి, 34 నుంచి 44 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు జేఏవో ఉద్యోగాలకు అర్హులు. వయోపరిమితిలో SC, SR, BCలకు 5 ఏళ్ల సడలింపు, అంగవైకల్యం ఉన్నవారికి 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. మే 10వ తేదీ సాయంత్రం 4:30 గంటలలోపు పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
HR ఉద్యోగాలకు
గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ MBA(HR), MSW, రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్ మెంట్, హ్యుమన్ రిసోర్సెస్, ఇండస్ట్రియల్ రిలేషన్ చేసిన వారు అర్హులు. న్యాయవిద్యను అభ్యసించిన వారిని అదనపు అర్హతగా గుర్తిస్తారు. 8 ఏళ్ల అనుభవం ఉన్నవారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవొచ్చు. పై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారుమే 20దీన హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 040-2312 0303 నంబర్‌ను సంప్రదించవచ్చు. వివరాలకు www.tsgenco.co.in, వెబ్ సైట్ చూడవచ్చు.