జేఎల్‌,డీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌

హైదరాబాద్‌  : గురుకులాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ లెక్చరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), డిగ్రీ లెక్చరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టులకు రాత పరీక్షల తేదీల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలైంది . 281 జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 466 డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు ఫిబ్రవరి 14 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల విద్యాసంస్థల రెక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు సోమవారం వెల్లడించింది . 14న తెలుగు, ఇంగ్లీ ష్‌, గణితం, బాటనీ, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెమిస్ట్రీ , జువాలజీ, కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హిస్టరీ సబ్జెక్టుల్లో, 15న స్టాటిస్ టిక్స్‌‌‌‌‌‌‌‌, మైక్రోబయాలజీ, పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టుల్లో డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందని తెలిపింది .16న జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులకు పెడగోగి సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష ఉంటుదని, 17న జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులకు ఉంటుందని పేర్కొంది. 18న గణితం, బాటనీ, హిస్టరీ, ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉర్దూ , తెలుగు, కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సబ్జెక్టుల్లో , 19న ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జువాలజీ, సివిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టుల్లో , 20న కెమిస్ట్రీ సబ్జెక్టులో జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు రాతపరీక్ష ఉంటుందని వివరించింది .

Posted in Uncategorized

Latest Updates