జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ప్రశాంత్ కిషోర్

ఇటీవల జేడీయూ పార్టీలో చేరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను జేడీయూ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు సీఎం నితీష్ కుమార్. దీంతో పార్టీలో రెండో శక్తివంతమైన నాయకుడయ్యారు ప్రశాంత్ కిషోర్. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్.. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీయూ వ్యాహకర్తగా పనిచేశారు.  తర్వాత పంజాబ్‌, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలకు వ్యూహరచన చేశారు. పంజాబ్‌ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బాగా పనిచేశాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ప్రశాంత్ కిషోర్ అత్యంత సన్నిహితుడు. ప్రశాంత్ కిశోర్ చేరిక వల్ల తమ పార్టీ అన్ని వర్గాలకు చేరువ అవుతుందని, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates