జైలులో సల్మాన్ ను కలసిన ప్రీతీ

salman-preity-zintaకృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్‌ కండల నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు ఐదేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయన ప్రస్తుతం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. సల్మాన్‌ను కలిసేందుకు నటి ప్రీతీ జింతా శుక్రవారం జైలుకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే అభిమానులు మాత్రం సల్మాన్‌కు సోషల్‌ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేశారు.దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కూడా సోషల్‌మీడియాలో స్పందించారు. గతంలో కూడా ఇండియాలో వేల సంఖ్యలో కృష్ణ జింకలను చంపేశారు. మీకు అది ఏ మాత్రం పెద్ద విషయం కాదు. రోజూ మనం ఆవుల్ని, మేకల్ని, పందుల్ని చంపేస్తున్నాం. ఆ ప్రాణాలు మనకు లెక్క లేవా… అని ఆయన ట్వీట్‌ చేశారు పూరీ.

అయితే ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. 1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ అనే సినిమా చిత్రీకరణ సమయంలో రాజస్థాన్‌ అడవుల్లో సల్మాన్‌ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు.

Posted in Uncategorized

Latest Updates