జైలు నుంచే ఆశీర్వాదం : లాలూ కుమారుడి ఎంగేజ్ మెంట్

LALU SONబీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఎంగేజ్ మెంట్ బుధవారం(ఏప్రిల్-18) పాట్నాలోని మౌర్యలో జరిగింది. ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న లాలూ మాత్రం ఈ ఫంక్షన్ కి హాజరుకాలేదు. RJD నేత చంద్రికా ప్రసాద్ రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్య రాయ్‌ ఎంగేజ్ మెంట్ కి 200 మంది అతిథులు హాజరయ్యారు.

ఈ నిశ్చితార్థం కోసం మౌర్య హోటల్‌ ను ప్రత్యేకంగా అలంకరించారు. ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు, పుణే నుంచి తీసుకొచ్చిన పువ్వులతో అట్టహాసంగా తీర్చిదిద్దారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిద్దరి వివాహం మే 12వ తేదీ పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగనుంది.

Posted in Uncategorized

Latest Updates