జైల్లో ఏడ్చిన సల్మాన్

salmanjail1కృష్ణ జింకను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడటంతో సల్మాన్‌ఖాన్ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిపాయి జైలు వర్గాలు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడని, సెల్‌ లో ఏడ్చేశాడని తెలిపారు జైలు అధికారులు. మొదట సల్మాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని బీపీ నార్మల్‌గానే ఉంది కానీ.. మానసికంగా కుంగిపోయాడు. జైల్లో అతను ఏడ్చాడు అని అధికారులు చెప్పారు. రాత్రి అన్నం కూడా తినలేదని తెలిపారు. శిక్ష పడుతుందని సల్మాన్ అసలు అనుకోలేదు. దీంతో అతను షాక్‌లో ఉన్నాడు. మిగతా ఖైదీలకు దూరంగా సల్మాన్‌ను ప్రత్యేక సెల్‌ లో ఉంచాం. జోధ్‌పూర్‌ లో జింకలను దేవతల్లాగా చూస్తారు. అందువల్ల సల్మాన్‌కు ఎలాంటి హాని జరగకూడదన్న ఉద్దేశంతో అతన్ని మిగతా ఖైదీలకు దూరంగా ఉంచాం అని అధికారులు వెల్లడించారు. అతనికి బెయిల్ కూడా రాకపోతే మరింత కుంగిపోయేలా ఉన్నాడని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates