జైళ్లో సీన్ రివర్స్ : 68 మంది ఖైదీలు మృతి

venizulaవెనిజులాలో దారుణం జరిగింది. వలెన్షియా సిటీలోని ఓ జైలు నుంచి ఖైదీలు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఖైదీల అల్లర్ల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 68 మంది చనిపోయారు. కారాబోబో రాష్ట్రంలో జరిగిన ఈ విషాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు.

బుధవారం(మార్చి28) జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కొందరు ఖైదీలు జైల్లోని పరుపులకు నిప్పంటించారు. దీంతో అగ్నిప్రమాదం జరిగి 68 మంది చనిపోయారు.  చనిపోయిన వారిలో ఖైదీలను చూసేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. . ప్రమాదం గురించి తెలియగానే ఖైదీల బంధువులు జైలు దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ ముందున్న వారిని తరిమేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఓ పోలీస్‌ ను అల్లరి మూకలు కాల్చి చంపినట్లు సమాచారం. సామర్థ్యానికి మించి వెనెజులా జైళ్లలో ఖైదీలు ఉండటంతో తరచుగా అక్కడ అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉంటాయి. దేశంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో  ఖైదీలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోవడంతో ఆగ్రహానికి గురై ఖైదీలు తిరుగుబాట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates