జొమాటో ఏం చేసింది..? ఆ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?

డెలివరీ చేయాల్సిన ఫుడ్డును మధ్యలోనే తింటున్న వ్యక్తి వీడియో వైరల్ కావడంతో…. జొమాటో ఇండియా సంస్థ స్పందించింది. తాము కస్టమర్స్ కు హైజీనిక్ ఫుడ్ అందించేందుకే ప్రయారిటీ ఇస్తామని… ఫుడ్ ట్యాంపరింగ్ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో దీనిపై వివరణ ఇచ్చింది జొమాటో ఇండియా.

రెడ్ కలర్ టీ షర్ట్… బ్యాగ్ తో ఉన్న వ్యక్తి వీడియో వైరల్ కావడంతో… తాము విచారణ చేశామని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇండియా తెలిపింది. ఈ సంఘటన మధురైలో జరిగిందని తెలిపింది. ఆ వ్యక్తితో చాలాసేపు మాట్లాడిన తర్వాత.. అది ఒక హ్యూమన్ ఎర్రర్ గా గుర్తించామని తెలిపింది. అతడిని ఉద్యోగం నుంచి తీసేశామని వివరించింది.

“ఇలాంటిది సాధారణంగా జరగదు. చాలా అరుదుగా జరిగిన సంఘటన ఇది. ఫుడ్ టాంపరింగ్ జరుగుతుందన్న సంగతిని మేం గుర్తించాం. దీనిని సీరియస్ గా తీసుకున్నాం. ఇకనుంచి డెలివరీ కాబోయే ఆహారానికి.. ట్యాంపర్ ప్రూఫ్ టేప్స్ వాడబోతున్నాం. ముందుజాగ్రత్త చర్యలు తీసకుంటాం. ప్యాకింగ్ సమయంలోనే మరో సేఫ్టీ లేయర్ ను ప్రవేశపెడతాం. ఒకటిన్నర లక్షల పార్ట్ నర్స్ కు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఇదే చెబుతున్నాం. ఇండియాలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ సంస్థగా మారబోతున్న తమకు…. భాగస్వామ్య సంస్థలు ఫేస్ లాంటి వాళ్లు. అందుకోసమే.. వారి సహకారంతో… ఫుడ్ ట్యాంపరింగ్ జరగకుండా.. కఠిన చర్యలు తీసుకోబోతున్నాం” అని వివరించింది.

ప్యాకెట్లు విప్పి కొంత తిని తిరిగి ప్యాక్ చేసిన వ్యక్తిపై నెగెటివ్ గా స్పందించిన సోషల్ మీడియా.. జొమాటో ఇండియా సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంపై కూడా నెగెటివ్ గానే స్పందించింది. ఇలా జరగడం బాధాకరం అంటూ కామెంట్లు పెట్టారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates