జోగు రామన్నకు తృటిలో తప్పిన ప్రమాదం

రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో ఇవాళ (సోమవారం)  ఓ ప్రయివేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లారు మంత్రి జోగు రామన్న. మంత్రి లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు లిఫ్ట్ తెగిపడింది. అయితే ఈ ప్రమాదంలో జోగు రామన్నకు ఏలాంటి గాయాలు కాలేదు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన మంత్రి… యథావిధిగా తన కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates