జోన్లపై ఉద్యోగసంఘాల హర్షం : 85 శాతం లోకల్ కోసం ప్రతిపాదన

JONSకొత్త జోన్ల  ఏర్పాటుపై  ప్రభుత్వ  ప్రతిపాదనలకు మద్దతు  చెప్పాయి  ఉద్యోగ సంఘాలు. భవిష్యత్  తరాల  కోసం  తీసుకున్న  ఈ నిర్ణయం  చరిత్రాత్మకమన్నారు సంఘాల నేతలు. జిల్లా, జోనల్, మల్టీజోన్, రాష్ట్రస్థాయిల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి హక్కులకు రక్షణ కల్పించేలా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఏడు జోన్లు, రెండు మల్టీజోన్ల విధానాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, స్వాగతించారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా జోనల్ వ్యవస్థకు మార్పులు చేసేందుకు సవరణల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు.

చిన్నచిన్న మార్పులను జేఏసీ సూచించిందని చెప్పారు. గ్రూప్-1 పోస్టులన్నీ మల్టీజోన్ పరిధిలోకి వచ్చేలా సవరణలను కోరుతున్నామని తెలిపారు. 85 శాతం స్థానికులకు, 15 శాతం తెలంగాణలోని ఇతర జిల్లాలకు అవకాశాలు లభించే విధంగా జోనల్‌ వ్యవస్థలో ప్రతిపాదనలు చేశామని వెల్లడించారు. ఏడుజోన్లు, రెండు మల్టీజోన్లు ప్రకటించి సీఎం చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించారని అన్నారు. స్థానికత విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నందున ముఖ్యమంత్రి తుదినిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉద్యోగ సంఘాల  JAC మీటింగ్ లో  చిన్న, చిన్న  మార్పులు  చేర్పులు  సూచిస్తూ…. CS కు నివేదిక ఇచ్చారు  లీడర్లు. CM KCR అధ్యక్షతన ఆదివారం మే-27  మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్ లో కేబినెట్ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో కొత్తగా  ఏర్పాటు చేయనున్న 7 జోన్లు, 2 మల్టీజోన్లు, రైతు జీవిత బీమా పథకం పై సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాల సూచనలతో  జోన్ల వ్యవస్థలో కొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

Posted in Uncategorized

Latest Updates