జోరు కొనసాగిస్తున్న ధావన్..నాలుగో వన్డేలో సెంచరీ

DHAVANజోహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం (ఫిబ్రవరి-10) సౌతాఫ్రికాతో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా ఓపెనర్ ధావన్ జోరు కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్ లలో మంచి స్కోర్ చేసిన ధావన్.. జోహన్నెస్‌బర్గ్ వన్డేలోనూ బ్యాట్ తో సత్తా చాటాడు. సెంచరీతో చెలరేగి ఆడుతున్నాడు.

రోహిత్ శర్మ (13 బంతుల్లో 5 పరుగులు, 1 ఫోర్) తక్కువ స్కోరుకే ఔట్ అవడంతో తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లితో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ కలిసి 168 బంతుల్లో 158 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ధవన్ సెంచరీ (103- 99 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) , కోహ్లి(75)  హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే 31.01 ఓవర్ లో కోహ్లీ (75) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 197 పరుగులుగా ఉండగా, ధావన్ (104, 9 ఫోర్లు, 2 సిక్స్), రహానే (5) రన్స్ తో  క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్రిస్ మొర్రీస్, రబడాకు చెరో వికెట్ దక్కాయి.

Posted in Uncategorized

Latest Updates