జోహనెస్‌బర్గ్‌ వన్డే : టీమిండియా బ్యాటింగ్

matchఆరు వన్డేల్లో భాగంగా శనివారం (ఫిబ్రవరి-10)న జోహనెస్‌బర్గ్‌ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస మ్యాచ్ లలో విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా..ఈ వన్డేలో గెలిచి, సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో విజయంసాధించి, మంచి ఫాంలోకి వచ్చారు భారత ప్లేయర్లు. నాలుగో వన్డేతో చరిత్ర సృష్టించడానికి గట్టిగానే ప్రాక్టీస్ చెసింది టీమిండియా. టెస్ట్ సిరీస్ కల కలగానే మిగిలిపోయినా.. ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచే అద్భుత అవకాశం కోహ్లి సేన ముందుంది. ఇప్పటికే ఆరు వన్డేల సిరీస్‌లో 3-0 లీడ్ సాధించిన భారత్.. నాలుగో వన్డేలో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. 25 ఏళ్లుగా సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవలేదు టీమిండియా. ఇప్పుడు విరాట్ సేన ఉన్న ఫామ్.. సౌతాఫ్రికా టీమ్‌కున్న కష్టాలు చూస్తే.. ఈసారి చరిత్ర తిరగరాయడం కన్ఫమ్ గా కనిపిస్తుంది. టీమిండియా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలుతున్న సఫారీలను డివిలియర్స్ ఎంత వరకు ఆదుకుంటాడో చూడాలి.

భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్) రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, అజింక్యా రహానె, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, అక్సర్ పటేల్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.

సౌతాఫ్రికా జట్టు: అయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జీన్ పాల్ డుమినీ, డేవిడ్ మిల్లర్, ఖాయ జొండో, క్రిస్ మోరిస్, పెహ్లుక్వాయో, కగిసో రబడ, ఇమ్రాన్ తాహిత్, ఎన్‌గిడి, ఫర్హాన్ బెహ్రాడీన్, మోర్న్ మోర్కెల్, తబ్రియాజ్ షంసీ.

Posted in Uncategorized

Latest Updates