జోహనెస్‌బర్గ్‌ వన్డే : రికార్డుపై కన్నేసిన టీమిండియా

INDఆరు వన్డేల్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లలో విజయాలతో దూసుకుపోతోంది టీమిండియా. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో విజయంసాధించి, మంచి ఫాంలోకి వచ్చారు భారత ప్లేయర్లు. శనివారం (ఫిబ్రవరి-10) జోహనెస్‌బర్గ్‌ లో జరిగే నాలుగో వన్డేతో చరిత్ర సృష్టించడానికి గట్టిగానే ప్రాక్టీస్ చెస్తుంది టీమిండియా. టెస్ట్ సిరీస్ కల కలగానే మిగిలిపోయినా.. ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచే అద్భుత అవకాశం కోహ్లి సేన ముందుంది.

ఇప్పటికే ఆరు వన్డేల సిరీస్‌లో 3-0 లీడ్ సాధించిన భారత్.. నాలుగో వన్డేలో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. 25 ఏళ్లుగా సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవలేదు టీమిండియా. ఇప్పుడు విరాట్ సేన ఉన్న ఫామ్.. సౌతాఫ్రికా టీమ్‌కున్న కష్టాలు చూస్తే.. ఈసారి చరిత్ర తిరగరాయడం కన్ఫమ్ గా కనిపిస్తుంది. టీమిండియా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలుతున్న సఫారీలను డివిలియర్స్ ఎంత వరకు ఆదుకుంటాడో చూడాలి.
మ్యాచ్ శనివారం (ఫిబ్రవరి-10) సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Posted in Uncategorized

Latest Updates