జోహనెస్‌బర్గ్‌ వన్డే : సౌతాఫ్రికా టార్గెట్-290

matchఆరు వన్డేల్లో భాగంగా శనివారం (ఫిబ్రవరి-10)న జోహనెస్‌బర్గ్‌ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్ (109) సెంచరీతో చెలరేగి ఆడాడు. రోహిత్ శర్మ (13 బంతుల్లో 5 పరుగులు, 1 ఫోర్) తక్కువ స్కోరుకే ఔట్ అవడంతో తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లితో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ కలిసి 168 బంతుల్లో 158 పరుగులు చేశారు. భారీ స్కోరు దిశగా వెళ్లే సమయంలో 31 ఓవర్లో విరాట్ (75) ఔట్ కావడంతో స్కోరుకు ఫుల్ స్టాప్ పడింది. ఆ వెంటనే ధావన్ వికెట్ కోల్పోయిన భారత్ ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది. మిస్టర్ కూల్ ధోనీ (42 నాటౌట్) ఆచితూచి ఆడటంతో ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ(2), ఎంగిడి(2) రెండు వికెట్లు తీయగా..మొర్రీస్, మొర్కెల్ కు చెరో వికాట్ దక్కాయి.

Posted in Uncategorized

Latest Updates