జ్యూయలరీ షాపులో దొంగలు బీభత్సం: కళ్లలో కారం చల్లి దోపిడి

sangaredyy
జ్యూయలరీ షాపులో సినీ ఫక్కీలో దొంగలు బీభత్సం సృష్టించారు. షాపు యజమాని కళ్లలో కారంచల్లి.. తుపాకీతో బెదిరించి కేజి బంగారం, 4 లక్షల నగదు దోచుకెళ్లారు దుండగులు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శ్రీ జయ భవాని జ్యూయల్లరీ షాపులో ఈ ఘటన జరిగింది.

మంగళవారం(జులై-3)రాత్రి ఎనిమిదిన్నర సమయంలో కస్టమర్లలాగా ఒక మహిళ, మరో వ్యక్తి షాపులోకి ప్రవేశించి 10 గంటల వరకు ఉన్నారు. షాప్ బంద్ చేసే టైం అయిందని యజమాని లోపలి రూమ్ లోకి వెల్లగానే వెనకాలే వెళ్లి కళ్లలో కారంచల్లి, నోటికి ప్లాస్టర్ అతికించి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ యాజమానిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఇద్దరు వ్యక్తులు 6 నెలల ముందు ఒకసారి షాప్ కు వచ్చినట్టు యజమాని చెబుతున్నాడు.

Posted in Uncategorized

Latest Updates