జ్యోతిష్యం, వాస్తు ఎఫెక్ట్ : ఆ మంత్రి.. రోజూ 340కిలోమీటర్లు వెళ్లి వస్తారు

MINISTER 340

దేవుడిపై భయం, భక్తితోపాటు జ్యోతిష్యంపై నమ్మకం ఉంటే ఆ మనిషి ఎలా ఉంటాడో చాలా సినిమాల్లో చూసి ఉంటాం. జేసీ గారు చెబితే చాలు ఆ దిక్కుకి పరిగెత్తేస్తాం.. ఆయన చెబితే చాలు గంగలో దూకినా బయటకు వస్తాం అనే నమ్మకం. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే చాలు.. ఇక ఎంత కఠినమైన పరీక్షలు అయినా సరే ఇట్టే ఎదుర్కొంటాం.. ఇప్పుడు అచ్చం ఇలాగే వ్యవహరిస్తున్నారు కర్నాటక మంత్రి రేవణ్ణ. ఈయన ఎవరో కాదు కర్నాటక సీఎం కుమారస్వామి సోదరుడు.. మాజీ ప్రధాని దేవగౌడకి పెద్ద కుమారుడు. ఈయన తలచుకుంటే నిమిషాల్లోనే పెద్ద పెద్ద బంగాళాలు కొనేస్తారు.. అలాంటిది రోజూ 340 కిలోమీటర్లు వెళ్లి వస్తున్నారు. కారణం జ్యోతిష్యం.

కర్నాటక కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. బెంగళూరులోని సొంత ఇంట్లో ఉండవద్దని.. అసలు బెంగళూరులోనే ఉండొద్దని పండితులు చెప్పారంట. దీంతో ఆయన బెంగళూరుకి 170 కిలోమీటర్ల దూరంలోని.. సొంతూరు అయిన హొలెనరసిపురకి వెళ్లి వస్తున్నారు. కనీసం బెంగళూరులో నిద్ర కూడా చేయటం లేదంట. రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి.. 9 గంటలకు బయలుదేరతారు. బెంగళూరుకి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. మళ్లీ రాత్రి 7 గంటలకు బెంగళూరులో బయలుదేరి సొంతూరికి 10గంటలకు చేరుకుంటున్నారు. రోజూ ఇంతే. బెంగళూరులో నిద్ర చేయకూడదన్న పండితుల మాటకు కట్టుబడి.. ఇంత పెద్ద వయస్సులోనూ రోజూ ఆరు గంటలు ప్రయాణం చేయటం విశేషం.

మరి ఎన్నాళ్లు ఇలా అంటే.. ప్రభుత్వం బంగళా కేటాయించే వరకు అని చెబుతున్నారు మంత్రి గారు. జ్యోతిష్యం మాటను ఖండిస్తున్నారు. సొంతూరులోని పనులు ఉన్నాయని.. కార్యకర్తలు, నేతలతో చర్చల కోసం వెళ్లి వస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం మంత్రి క్వార్టర్స్ ఇస్తే బెంగళూరులోని ఉంటానని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates