జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ అయ్యింది. జ‌య‌ల‌లిత జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం అని ఆమెపై సినిమా తీయాల‌ని ప‌లువురు ద‌ర్శక నిర్మాత‌లు భావించారు.అయితే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ముందుగా తాను తెర‌కెక్కించనున్న‌ బయోపిక్ టైటిల్ పోస్ట‌ర్‌ని ఆ మ‌ధ్య మురుగ‌దాస్ చేతుల మీదుగా విడుద‌ల చేయించింది.

‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ జయలలిత పాత్రలో నటించనుందని అన్నారు. కాని తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమాలో లీడ్ రోల్ నిత్యామీన‌న్ పోషిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. జ‌య‌లలిత వ‌ర్థంతి డిసెంబ‌ర్ 5,2016  సంద‌ర్భంగా ఇవాళ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో నిత్యామీన‌న్ అచ్చం జ‌య‌ల‌లిత లుక్‌లో క‌నిపిస్తుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక విష్ణు ఇందూరి నిర్మాణంలో ఏఎల్ విజ‌య్ కూడా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తీస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రో వైపు త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా.. జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్‌ని కానీ… అనుష్కను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు భారతీ రాజా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates