ఝల్రపాఠన్‌ లో గెలిచిన వసుంధర రాజె

 రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె గెలుపొందారు. ఝల్రపాఠన్‌ నుంచి  పోటీలో నిలిచిన రాజె.. బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్‌ కొడుకు మన్వేంద్ర సింగ్ పై గెలిచారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మన్వేంద్ర కాంగ్రెస్ లో చేరారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు గెలువనుంది. రాజస్థాన్ ఫలితాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మట్లాడారు. స్థానిక ప్రభుత్వా పనితీరు బాగా లేకపోవడం వల్లే బీజేపీ అధికారానికి దూరమైందని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates