టక్-టక్ గ్యాంగ్ లీడర్ : ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే వెరీ షాక్

ytrతమిళం తప్ప వేరే భాష తెలుసని ప్రపంచానికి తెలియదు. చూడటానికి అమాయకుడిగా కనిపిస్తాడు. అతడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అతడే ముంబైని హడలెత్తించే టక్-టక్ గ్యాంగ్ లీడర్ రవిచంద్రన్ ముదలియార్. సాధారణంగా మనం సినిమాల్లో మాత్రమే ఇలాంటి స్టోరీలు చూస్తుంటాం. ఇప్పుడు ఓ కేసును చూసి పోలీసులే షాక్ అవుతున్నారు.
తమిళనాడుకి చెందిన రవిచంద్రన్ ముదలియార్ తన భార్యా, పిల్లలతో కొంతకాలం క్రితం ముంబై వచ్చాడు. అతడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరు నవీ ముంబైలో నివసిస్తుండగా.. కొంతకాలం నుంచి రవిచంద్రన్ మాత్రం వేరుగా గొవాండి ఏరియాలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రూ.2.5 లక్షల దొంగతనం కేసులో మొదటి ముద్దాయిగా ఇటీవల రవిచంద్రన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ సమయంలో తమిళ్ తప్ప తనకు వేరే భాష అర్ధం కానట్లుగా ప్రవర్తించాడు. దీంతో తమదైన స్టయిల్ లో విచారించగా నిజాలు బయటికొచ్చాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవిచంద్రన్ పెద్ద కొడుకు MBBS పూర్తి చేసి నవీ ముంబైలో ఓ ప్రముఖ ఆస్పత్రి డాక్టర్ గా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు మర్చంట్ నేవీగా పని చేస్తుండగా, మూడో కొడుకు హోటల్ మేనేజ్ మెంట్ చదువుతున్నాడు. కొంతకాలం క్రితం మరో నలుగురితో కలసి రవిచంద్రన్ ముదలియార్ టక్-టక్ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వీళ్లు రోడ్లపై వెళ్తున్న కారుని ఆపి ఆయిల్ లీక్ అవుతుందని డ్రైవర్ ని మాటాల్లోకి దింపుతారు. కారులోని విలువైన ఫోన్లు, బ్యాగ్, ఇతర వస్తువులను దోచుకెళ్తారు.

కొన్ని రోజుల క్రితం ఇలాగే దక్షిణ ముంబైలో ఓ మహిళ కారులో నగలు కొట్టేయడంతో ఆమె పోలీసులకు కంఫ్లెయింట్ చేసింది. పోలీసులు ముదలియార్‌, అతని గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. గతేడాది మార్చిలో SBIకి చెందిన క్యాష్ వెహికిల్ నుంచి కోటిన్నర నగదు ఎత్తుకెళ్లిన కేసులోనూ ముదలియార్ నిందితుడిగా ఉన్నాడు. అతన్ని విచారించిన తర్వాత ఓ దగ్గర దాచి పెట్టిన లక్షన్నర విలువైన బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates