టర్కీలో దారుణం : డబ్బుల కోసం.. IAS అధికారి కొడుకు హత్య

19225599_10212020705260390_3381190064888544799_nటర్కీలో ఉగ్రవాదుల తెగబడ్డారు. డబ్బు కోసం బరితెగించారు. IAS అధికారి కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు. సోమవారం (మే-28) ఇస్తాంబుల్ లో జరిగిన ఈ ఘటన ఓ కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. తెలంగాణ కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న శశాంక్ గోయల్ కుమారుడు శుభమ్ ను హత్య చేశారు ముష్కరులు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శుభమ్… స్నేహితులతో కలిసి టర్కీ పర్యటనకు వెళ్లారు. ఇస్తాంబుల్ పర్యటనలో ఉండగా డబ్బు కోసం ఉగ్రవాదులు వెంబడించారు. డబ్బు ఇచ్చేందుకు ఆయన తిరస్కరించటంతో… ఆగ్రహంతో శుభమ్ పై కాల్పులకు తెగబడ్డారు. స్నేహితులు ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందారు. తండ్రి శశాంక్ గోయల్ కు సమాచారం అందటంతో ఇస్తాంబుల్ బయలుదేరి వెళ్లారు. ఈఘటనపై సీఎం కేసీఆర్, మంత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates