టర్కీ లో రెండు రైళ్లు ఢీ.. 9 మంది మృతి

 టర్కీ రాజధాని అంకారా లో రైలు ప్రమాదం జరిగింది. ఓ హై స్పీడ్ రైలు మ‌రో రైలును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని… 47 మంది గాయపడ్డారని టర్కీ ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే.. రెస్కూటీం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.  భారత కాలమానం ప్రకారం గురువారం పొద్దున 6.30 నిమిషాలకు  ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై అంకారా గవర్నర్ వాసిప్ సాహిన్ స్పందించారు. రైలు అంకారా నుంచి కోన్యా ప‌ట్ట‌ణం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు.

అంకారా ప్ర‌ధాన స్టేష‌న్ నుంచి 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌ర్సాండిజ్ రైల్వే స్టేష‌న్‌ దగ్గర ప్ర‌మాదం జ‌రిగింది. చనిపోయిన వారిలో  ట్రైన్ డ్రైవ‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు సిబ్బంది, ఆరు మంది ప్ర‌యాణికులు ఉన్నట్టు టర్కీ పోలీసులు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో రైలులో 206 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. గాయాలపాలైన వారిలో ముగ్గురి పరిస్తితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అధిక సంఖ్యలో హాజరైన సహాయక బృందాలు.. గాయపడినవారిని దవాఖానాకు తరలించాయి.

ఈ ఘటనపై యూనియన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ టర్కిష్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ చైర్మెన్ ట్విటర్ లో స్పందించారు. సిగ్నలింగ్ ప్రాబ్లమ్ ఏర్పడటం వల్లనే ఈ భారీ ప్రమాదం జరిగిందని తెలిపారు.

 

 

Posted in Uncategorized

Latest Updates