టాటూ క్రేజ్… జోరుగా రోడ్ సైడ్ వ్యాపారం

  • పచ్చబొట్టు .. యూత్‌ కు ఫ్యాషన్‌‌‌‌
  • రంగురంగుల్లో.. రకరకాలుగా..
  • జోరుగా రోడ్‌ సైడ్‌ వ్యాపారం
  • కేర్‌ తీసుకోకుంటే రిస్కే

రీసెంట్‌ గా రోడ్‌ సైడ్‌ టాటూ బిజినెస్‌ జోరందుకుంది. తక్కువ ఖర్చుతో యూత్‌ ఇంట్రెస్ట్‌ కు తగ్గట్టు వీరు పచ్చబొట్టు వేస్తూ గిరాకీ పెంచుకుంటున్నారు. వేలాది రూపాయలు పెట్టి  ట్యాటూయిస్ట్ ల వద్దకు వెళ్లే కంటే రోడ్‌ సైడ్‌ షాపులో వేసే టాటూలపైనే యూత్‌ ఆసక్తి చూపుతోంది. అయితే పచ్చబొట్టు వేసే సూదులు, రంగుల్లో వాడే క్వాలిటీ? ఒకరికి ఉపయోగించిన సూదిని మరొకరిని వాడుతున్నారా? వంటి వాటిపై కూడా నజర్‌ వేయాలి.

ట్రెండ్‌ కు సింబాలిక్‌ ..

జీవితకాలం ఉండే జ్ఞాపకం పచ్చబొట్టు. పాజిటివ్ వైబ్స్ కోసం, ప్రొఫెషన్ ని తెలిపేందుకు, ఫ్యాషన్ గా, ట్రెండీగా ఉండేందుకు అనేకమంది పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. ట్రెండ్ కి తగినట్టుగా తాముండాలని యూత్‌ దీన్ని ఫ్యాషన్‌‌‌‌గా మార్చుకుంది. పక్షులు, కొటేషన్లు, పేర్లు, డిజైన్లు, ఫొటోలు ఇలా అన్ని రకాల పచ్చబొట్లు అందుబాటులోకి వచ్చేశాయి. మైండ్ సెట్ కి అనుగుణంగా శరీరంపై తమకు నచ్చిన భాగంలో పచ్చబొట్టును వేయించుకుంటున్నారు. వీటికి ఉన్న క్రేజ్ తో నగరంలో ట్యాటు స్టూడియోలు అనేకం పుట్టుకొచ్చాయి. అయితే పల్లెవాసులకు సుపరిచితమైన సూదులతో వేసే పచ్చబొట్టుకే చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు.

కోరినడిజైన్స్‌ లో..

జైపూర్, నాగోల్ నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన ఈ కళాకారులు నగరంలోని పలు ప్రాంతాల్లో పచ్చబొట్టు వేయడాన్నే ఉపాధిగా మార్చుకున్నారు. కోటి ఉమెన్స్ కా లేజ్ వద్ద ఈ బిజినెస్‌ జోరుగా సాగుతుంది. ఫుట్ పాత్ పై చాలామంది టాటూ వేస్తూ కన్పిస్తారిక్కడ. వీరి వద్ద ఉన్న డబ్బాల్లో నాలుగైదు కట్టల సూదులు, మూడు రకాల రంగులు, పెన్ లాంటి చిన్న మిషెన్ ఉంటాయి. వీరి వద్ద టెంపరరీ టాటూ ఉండదు.. పర్మినెంట్‌ పచ్చబొట్టే వేస్తారు. చాలామంది కా లేజీ స్టూడెంట్స్, ఎంప్లాయీస్‌ తమకు నచ్చిన రీతిలో పచ్చబొట్టు వేయించుకుంటారిక్కడ. వీరి దగ్గర అన్ని రకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని సార్లు కస్టమర్లు తమకు కా వాల్సిన డిజైన్ ని చూపించి వేయించుకుంటారు.

ఢిల్లీ నుంచి రంగులు..

పచ్చబొట్టు వేయడం ఫటాఫట్‌ పూర్తవుతుంది. టాటూ కోసం సూది.. రంగులను ఢిల్లీ నుంచి తెప్పిస్తుంటారు. ఒకరికి వాడిన సూదిని ఇంకొకరికి ఉపయోగించరు. అయితే కలర్ లిక్విడ్ మాత్రం అందరికీ ఒకటే వాడుతారు. వీరి వద్ద నలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల లిక్విడ్లు ఉంటాయి. సూదిని పెన్ లాంటి మిషన్ లో పెట్టి లిక్విడ్ లో అద్దుతూ పచ్చబొట్టు పొడుస్తారు. పసుపు అద్ది, ఒక సారి తుడిచి నూనె రాస్తారు. ధర రూ.10 నుం చి రూ. 300 వరకు ఉంటుంది.

స్కిన్ డిసీజెస్ ఎక్కువే..

టాటూస్‌ తో చర్మ వ్యాధులు వస్తాయని స్కిన్ స్పెషలిస్టులు హెచ్చరిస్తున్నారు. పచ్చబొట్టు వేయించుకున్నప్పుడు అందులో వాడే కెమికల్స్ శరీరంలోకి చొచ్చుకుపోయి రక్తంలో కలిసిపోతాయి. వీటివల్ల ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు, స్కిన్ కాన్సర్ , వైరల్ ఇన్ఫెక్షన్, స్కిన్ ట్యూ బర్ గ్లోసెస్ , గ్రానిలోమా, వైరల్ వాచ్ వంటి వ్యాధులు సోకవచ్చు. ట్యాటులోవాడే కెమికల్స్ లో నైట్రోజన్, కార్బన్ సంబంధ పదార్థాలే ఎక్కువ. దీంతో ట్యాటు వేసిన కొన్ని రోజుల వరకు దురద పెట్టడం, ర్యాషెస్, ఉబ్బడం కామన్‌‌‌‌. ఈ కెమికల్స్‌‌‌‌ రక్తంలో కలిసిపోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80శాతం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ట్యాటు వేసుకున్న వారు రెండు మూడు నెలల వరకు రక్తదానం చేయొద్దని స్కిన్ కేర్ కాస్మో టాలజిస్ట్ డాక్టర్‌ దివ్యా విశ్వనాథ్ వివరించారు. టెంపరరీ ట్యాటులతో సమస్యలుండవని, పర్మినెంట్ టాటూల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. టాటు మిషన్ల వల్ల… వాటిలో వాడే కలర్స్ వల్ల త్వరగా స్కిన్ డిసిజెస్ వస్తాయన్నారు. పర్మినెంట్ ట్యాటులకు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates