టాయిలెట్ కూడా స్పేస్ సూట్ లోనే : నాసా సరికొత్త ఆవిష్కరణ

astronuatsస్పేస్‌సూట్ ధరించినప్పుడు వ్యోమగాములు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చర్యలు ప్రారంభించింది. స్పేస్‌సూట్‌లోనే విసర్జితాలను సేకరించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది నాసా. దీంతో అత్యవసర సమయాల్లో వ్యోమగాములు ఆరు రోజులపాటు స్పేస్‌సూట్‌లోనే ఉండే అవకాశం ఉంటుంది. దీనిని ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్స్ సూట్స్ అని పిలుస్తున్నారు. వీటిని త్వరలో నాసా ప్రయోగించనున్న ఓరియన్ మిషన్‌లో వినియోగించనున్నారు. ప్రస్తుతం వ్యోమగాములు మలమూత్ర విసర్జనకు మామూలు సమయాల్లో టాయ్‌లెట్లను వాడుతుండగా, స్పేస్‌సూట్ ధరించినప్పుడు శానిటరీ న్యాప్కిన్స్ తరహాలో ఉండే ప్యాడ్స్‌ను వినియోగిస్తున్నారు. ఇవి కేవలం పదిగంటలు మాత్రమే పనిచేస్తాయి. చంద్రుడిపైకి వెళ్లే క్యాప్సూల్స్‌లో ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించరు. ప్రత్యేక ట్యూబ్‌ను ఏర్పాటు చేసి ఒక బ్యాగ్‌కు అనుసంధానిస్తారు. ఈ సమస్యలన్నిటికీ ఇప్పుడు కొత్త స్పేస్‌సూట్‌లతో పరిష్కారం లభించనుంది.

Posted in Uncategorized

Latest Updates