టాయ్ లెట్ నిర్మాణం కోసం బిచ్చమెత్తిన మహిళ

toilet buildస్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిలో టాయిలెట్ తప్పని సరిగా ఉండాలని కేంద్ర ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్మాణాలకు అయ్యే ఖర్చు కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది. ఈ సదుపాయాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరింది. అయితే…అది అమల్లో మాత్రం సాధ్యం కావడం లేదు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయడానికి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఓ మహిళ టాయిలెట్ నిర్మాణం కోసం బిచ్చమెత్తింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది.

బీహార్ రాజధాని పాట్నా లోని కోశి ప్రాంతానికి చెందిన అమీనా ఖాతూన్ అనే మహిళ… చుట్టుపక్కల గ్రామాల్లో బిచ్చమెత్తుకుని టాయ్ లెట్ నిర్మించుకుంది. తన భర్త చనిపోవడంతో పూట గడవడం కోసం అమీనా కూలీ పనులకు వెళ్తుండేది. టాయ్ లెట్ నిర్మాణం కోసం అధికారుల దగ్గరకు వెళ్లి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఎలాగైన టాయిలెట్ నిర్మించుకోవాలనే పట్టుదలతో..బిక్షాటన చేసి  మరుగుదొడ్డిని కట్టించుకుంది. ఆమె పరిస్థితిని చూసి నిర్మాణ కార్మికులు డబ్బులు కూడా తీసుకోలేదు. ఈ విషయం తెలిసిన  ఉన్నాతాధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు.

Posted in Uncategorized

Latest Updates