టార్గెట్ కొట్టేసింది : అగ్ని-2 క్షిపణి ప్రయోగం సక్సెస్

agni 2అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-2 మధ్యశ్రేణి క్షిపణిని ఇవాళ (మంగళవారం,ఫిబ్రవరి-20) విజయవంతంగా పరీక్షించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(SFC) ఈ పరీక్షను నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ మిస్సైల్‌ను పరీక్షించారు.

బాలాసోర్‌ జిల్లా వీవర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ కాంప్లెక్స్ 4 నుంచి మంగళవారం ఉదయం 8.38 గంటలకు ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితలం నుంచి ఉపరితంపైకి ప్రయోగించే ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను చేధించగలదు. 20 మీటర్ల పొడవు, 17టన్నుల బరువుండే ఈ క్షిపణి 1,000 కిలోల వార్‌హెడ్‌‌లను మోసుకుపోగలదు.

Posted in Uncategorized

Latest Updates