టార్గెట్ ఫిక్స్ చేశాం : సిటీ శివార్లలోకి కాలుష్య పరిశ్రమలు

KTRహైదరాబాద్ సిటీలోని చెరువులు కలుషితం కావటం కారణం మానవ తప్పిదాలే అన్నారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 3వేల 132 చెరువులు ఉన్నట్లు వెల్లడించారు. ఇళ్లలోని మురుగు నీరు చెరువుల్లోకి వదలటం వల్ల.. కాలుష్యంగా మారాయన్నారు. ORR పరిధిలో 40 చెరువులను శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ.287 కోట్లతో 20 చెరువులను శుద్ధి చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. హైదరాబాద్‌లోని 90 శాతం సీవరేజ్ మూసీ నదిలోకి వెళ్తుందన్నారు.

హుస్సేన్ సాగర్ బయోలాజికల్ ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయన్నారు. అదేవిధంగా 20 వినాయక సాగర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక వెయ్యి 234 కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నాయని.. వీటిని నగర శివార్లలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి. మూడు నెలల్లో 100 కాలుష్య కారక పరిశ్రమలను తరలించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఫార్మా సిటీకి మరో 400 పరిశ్రమలను తరలిస్తామన్నారు. పర్యావరణ హితం కోసం ఇప్పటికే 13 కంపెనీలను మూసివేయించామన్నారు కేటీఆర్..

Posted in Uncategorized

Latest Updates