టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయింది : చిరంజీవి

Megastar-Chiranjeevis-Next-Political-Move-in-2018హాస్యనటుడు గుండు హనుమంతారావు మృతిపట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి తీరని లోటు అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. అనారోగ‍్యంతో గుండు హనుమంతరావు సోమవారం (ఫిబ్రవరి-19) కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్య నటుడిదీ ఒక్కో శైలి అన్నారు. గుండు హనుమంతరావు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారన్నారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను అని తెలిపిన చిరంజీవి..తన వంతు సాయం అందించినట్లు చెప్పారు. పరిపూర్ణ ఆరోగ్యంతో గుండు హనుమంతరావు తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించానని..అయితే ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని బాధపడ్డారు. గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు చిరంజీవి.

 

Posted in Uncategorized

Latest Updates