టాలెంట్ ఉంటేనే అమెరికాకు రావాలి: ట్రంప్

వాషింగ్టన్: టాలెంట్ ఉన్న వారే అమెరికాకు రావాలని వారికే వీసాలు ఇస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు. బోర్డర్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని తమ దేశానికి రావాలనుకునే వారు చట్టపరంగా రావాలన్నారు. అక్రమంగా దేశంలోకి వచ్చే వారి గురించి మీడియా అడగ్గా.. ట్రంప్ ఈ కామెంట్లు చేశారు. దేశ అభివృద్ధికి సహాయపడే వారే అమెరికాకు రావాలి. తమ దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు కూడా స్కిల్ ఉన్న అభ్యర్ధులనే సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు రావాలనుకునే ఇండియన్ టెక్కీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates