టాలెంట్ ఉండాలి : బీటెక్ స్టూడెంట్స్ కు రూ.80వేల స్కాలర్ షిప్

anuఅత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థుల కోసం ఓ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఉన్నత విద్య చదువుకోవడానికి విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు అడ్డుకట్టవేసి.. దేశీయంగానే మానవ వనరులను అభివృద్ధి చేయాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి రిసెర్చ్ ఫెలోషిప్స్(PMRF) స్కీంను ప్రకటించింది కేంద్రం. ఈ పథకం ద్వారా 2018-19 నుంచి ఏడేళ్లపాటు రూ.1,650 కోట్లను వెయ్యి మంది పీహెచ్‌డీ విద్యార్థుల కోసం ప్రతి ఏడాది ఖర్చు చేయనుంది.

ఈ పథకం ద్వారా ప్రముఖ విద్యాసంస్థలు IISC, IIT, NIT, IISER, IIITల్లో బీటెక్ పూర్తయిన, చివరి సంవత్సరం చదువుతున్న, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎమ్మెస్సీ(సైన్స్ అండ్ టెక్నాలజీ) స్టూడెంట్స్ కు ఐఐటీలు, ఐఐఎస్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి తుది జాబితాను ఎంపిక చేస్తారు. వీరందరూ మొదటి రెండు సంవత్సరాలు నెల‌కు రూ.70వేలు, మూడో ఏడాది రూ.75వేలు, నాలుగు, ఐదో సంవత్సరం రూ.80వేల స్కాలర్‌షిప్ అందుకోనున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని.. ఈ పథకానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
engeneerung

Posted in Uncategorized

Latest Updates